గురువారం 02 జూలై 2020
Andhrapradesh-news - May 27, 2020 , 17:38:21

ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్థరహితం

ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్థరహితం

అమరావతి:  రైతు భరోసా కేంద్రాలతో  రాష్ట్ర రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఏపీ మంత్రి కన్నబాబు తెలిపారు. రైతు భరోసా కేంద్రాలను భవిష్యత్‌లో మరింత పటిష్టం చేస్తామని చెప్పారు. బుధవారం మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు.

'కొత్త యాప్‌ ద్వారా రైతు ఎప్పటికప్పుడు పంటల వివరాలు నమోదు చేయవచ్చు. ఐదు లక్షల మంది రైతులనుద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తారు.  రైతు భరోసా కేంద్రాల పర్యవేక్షణకు జాయింట్‌ కలెక్టర్లను నియమించాం. మే 30 నుంచి రైతు భరోసా కేంద్రాలను ప్రజాప్రతినిధులు సందర్శిస్తారు. జూన్‌ 1 నుంచి వ్యవసాయానికి సంబంధించిన పనులు ముమ్మరం చేస్తాం. రైతుల  సంక్షేమం గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు. చంద్రబాబు రైతులను మోసం చేశారు. రాష్ట్రంలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు అర్ధరహితం.  రైతులకు ఏం చేశారనేదానిపై చర్చకు సిద్ధమా? సంక్షోభ సమయంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామని' మంత్రి చెప్పారు.logo