సోమవారం 28 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 05, 2020 , 17:52:16

కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం: మంత్రి ఆళ్ల నాని

కరోనాపై అప్రమత్తంగా ఉన్నాం: మంత్రి ఆళ్ల నాని

అమరావతి: కరోనాపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని   అన్నారు. కరోనా నియంత్రణపై సీఎం వైఎస్‌  జగన్‌ మోహన్‌ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు.  కరోనా నియంత్రణ కోసం నెలకు  రూ.350 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 

'దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో టెస్టులు చేస్తున్నాం. ప్రజల ఆరోగ్యం కన్నా డబ్బు ముఖ్యం కాదన్న సంకల్పంతో సీఎం ముందుకెళ్తున్నారు. ప్లాస్మా దానం చేసిన వారికి రూ.5వేలు ప్రోత్సాహకం అందిస్తున్నాం. వైఎస్‌ఆర్‌ జిల్లాలో ఇప్పటి వరకు 1080  బెడ్లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా 300 ఆక్సిజన్‌ బెడ్లను అందుబాటులోకి తెచ్చాం. నాన్‌ కోవిడ్‌ కేర్‌, కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని' మంత్రి పేర్కొన్నారు. 


logo