శనివారం 11 జూలై 2020
Andhrapradesh-news - Jun 02, 2020 , 14:23:47

తిరుమల శ్రీవారి దర్శనాలకు గ్రీన్‌ సిగ్నల్‌

తిరుమల శ్రీవారి దర్శనాలకు గ్రీన్‌ సిగ్నల్‌

తిరుపతి: తిరుమల శ్రీవారి  దర్శనానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.   తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్‌ నడిపేందుకు అనుమతించింది.  భక్తులు 6 అడుగులు భౌతికదూరం పాటిస్తూ దర్శనం కల్పించాలని  టీటీడీకి ప్రభుత్వం సూచించింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో  భక్తుల దర్శనానికి అనుమతించాలని కోరుతూ టీటీడీ ఈవో  రాసిన లేఖకు స్పందించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్... అందుకు అనుమతిస్తూ మంగళవారం   ఉత్తర్వులు జారీ చేశారు.

కరోనా కారణంగా తిరుమలలో భక్తుల దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.  తిరుమల చరిత్రలో ఇలాంటి కీలక నిర్ణయం తీసుకోవడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.logo