మంగళవారం 04 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 04, 2020 , 10:48:59

రైతుల బాకాయిల చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు

రైతుల బాకాయిల చెల్లింపునకు ఏపీ ప్రభుత్వం చర్యలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో చక్కెర కర్మాగారాలు నష్టాల బాటలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయి. రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో భారీ స్థాయిలో బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో కర్మాగారాలను నడిపించడం కష్టతరంగా మారింది. రైతులు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో నష్టాల్లో ఉన్న సహకార చక్కెర కర్మాగారాలను గాడిన పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ముందకుకొచ్చింది. దీనిలో భాగంగా ఫ్యాక్టరీకి చెరకును సరఫరా చేసిన రైతులకు పూర్తిస్థాయిలో బకాయిలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేసింది.

దీనిపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించిన ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీ రైతు దినోత్సవం సందర్భంగా రైతులకు రూ. 54.6 కోట్లను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అలాగే సహకార చక్కెర ఫ్యాక్టరీలపై మరింత అధ్యయనం చేయాలని మంత్రులను, అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఆగష్టు 15లోగా నివేదికను సమర్పించాలని ఆయన సూచించారు.logo