శుక్రవారం 27 నవంబర్ 2020
Andhrapradesh-news - Jul 21, 2020 , 20:06:28

ఏపీ : మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ థాట్రాజ్ మృతి

ఏపీ : మాజీ ఎమ్మెల్యే జనార్దన్‌ థాట్రాజ్ మృతి

విశాఖపట్నం : విజయనగరం జిల్లా కురుపాం మాజీ ఎమ్మెల్యే గాలి జనార్థన్ థాట్రాజ్ (44) మంగళవారం గుండెపోటుతో కన్నుమూశారు.  విజయనగరంలోని తన నివాసంలో ఉదయం ఛాతినొప్పి రావడంతో భార్య ఈశ్వరి స్థానికంగా ఓ ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 2009లో కురుపాం ఎమ్మెల్యేగా ఆయన విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ తరపున కురుపాం నుంచి నామినేషన్ వేసిన జనార్థన్ థాట్రాజ్.. కుల వివాదం కారణంగా ఇబ్బందుల్లో పడ్డారు. ఆయన నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు. సీనియర్ రాజకీయ నేత, మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు జనార్థన్ థాట్రాజ్ స్వయానా మేనల్లుడు. జనార్థన్ థాట్రాజ్ మరణంతో కురుపాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.