బుధవారం 05 ఆగస్టు 2020
Andhrapradesh-news - Aug 01, 2020 , 16:02:17

క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల రావు క‌న్నుమూత‌

క‌రోనాతో మాజీ మంత్రి మాణిక్యాల రావు క‌న్నుమూత‌

అమ‌రావ‌తి : బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాల రావు(60) కన్నుమూశారు. పశ్చిగోదావరి జిల్లాకు చెందిన మాణిక్యాలరావు 2014 ఎన్నికల్లో తొలిసారి బీజేపీ తరఫున పోటీ చేసి తాగేప‌ల్లిగూడెం ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలి ప్ర‌య‌త్నంలోనే అప్పటి టీడీపీ ప్రభుత్వంలో దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2018 వరకు మంత్రిగా కొనసాగారు. కరోనా పాజిటివ్‌గా తేల‌డంతో గ‌త‌ నెల రోజులుగా విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో నేడు క‌న్నుమూశారు. మాణిక్యాల‌రావు ఫోటో గ్రాఫ‌ర్‌గా కెరీర్ ప్రారంభించి మంత్రిగా ఎదిగారు. 

మాజీ మంత్రి మ‌ణిక్యాల రావు మ‌ర‌ణం తీవ్రంగా బాధించింద‌ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి అన్నారు. సుదీర్ఘ ప్రజా జీవితంలో ఎంతోమందిని క‌లుసుకుని క్షేత్ర‌స్థాయిలో ప‌నిచేసిన‌ట్లు తెలిపారు. ఆయ‌న మృతి పార్టీలో శూన్యతను మిగిల్చిందన్నారు. మ‌ణిక్యాల‌రావు మృతి ప‌ట్ల ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. 

మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ఏపీ సీఎం వైయస్‌.జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.


logo