Andhrapradesh-news
- Nov 30, 2020 , 16:28:09
ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాం: సీఎం జగన్

అమరావతి: వరదలతో నష్టపోయిన రైతులందరికీ డిసెంబర్ 31లోగా పరిహారం అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. రంగు మారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన రైతులకు 80శాతం సబ్సిడీపై విత్తనాలు ఇస్తామన్నారు. వరదసాయంపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేశారు.
'పంట నష్టంపై నిజాయితీగా సమీక్షించాం. అక్టోబర్, నవంబర్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. మృతుల కుటుంబాలకు 5లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తాం. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. సహాయక శిబిరాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి రూ.500 ఆర్థిక సాయం ఇవ్వాలని నిర్ణయించాం, ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని' జగన్ పేర్కొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING