బుధవారం 21 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 09, 2020 , 17:43:18

అంగన్‌వాడీల రూపురేఖలు మార్చబోతున్నాం: సీఎం జగన్‌

 అంగన్‌వాడీల రూపురేఖలు మార్చబోతున్నాం: సీఎం జగన్‌

అమరావతి: రాష్ట్రంలో  అంగన్‌వాడీల రూపురేఖలు పూర్తిగా మార్చబోతున్నామని,  క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీపడొద్దని ముఖ్యమంత్రి   జగన్‌మోహన్‌రెడ్డి  సూచించారు.  వైఎస్‌ఆర్‌  ప్రిప్రైమరీ స్కూళ్లపై  సీఎం   జగన్‌.. మంత్రులు, ఉన్నతాధికారులతో  సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీల్లో  నాడు-నేడు కార్యక్రమంలో రన్నింగ్‌ వాటర్‌తో టాయిలెట్లు, తాగు నీరు, చిన్న పెద్ద మరమ్మతులు, విద్యుద్దీకరణ, కిచెన్, రిఫ్రిజిరేటర్, ఫర్నీచర్,‌ చాక్‌ బోర్డు, 55 అంగుళాల టీవీ, ప్లే జోన్‌ ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 

అంగన్‌వాడీ అభివృద్ధి కమిటీల ఏర్పాటు, మెటీరియల్‌ సేకరణ పూర్తి చేయాలని సీఎం  ఆదేశించారు. తొలిదశ పనులు వచ్చే ఏడాది జూన్‌ 30లోగా  పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.   అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మహిళా శక్తి సూపర్‌వైజర్లు   ఇంగ్లీష్‌లో  మాట్లాడేలా శిక్షణ  ఇప్పించాలని సూచించారు.   నవంబర్‌ రెండో వారం నుంచి పీపీ-1, పీపీ-2 స్కూళ్లు ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ టీచర్స్‌ ట్రైనింగ్‌ విషయంలో అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.   అంగన్‌ వాడీల్లో క్రీడా స్థలం  కూడా ఉండేలా మార్పులు చేయాలని సీఎం ఆదేశించారు. logo