శనివారం 31 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 18, 2020 , 16:18:00

రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడాలి: సీఎం జగన్‌

రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడాలి: సీఎం జగన్‌

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్‌–19 నివారణ చర్యలపై ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, హెల్త్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. కరోనా టెస్టులు, క్వారంటైన్‌లలో వసతులు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో వైద్య సేవలు, కాల్‌ సెంటర్ల పనితీరు, వైద్య సిబ్బంది నియామకాలు, హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి కల్పిస్తున్న సదుపాయలు వంటి అంశాలపై సీఎం  జగన్‌ సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించారు.

'ఆస్పత్రి సేవలు అద్వాన్నంగా ఉన్న జిల్లాలపై ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టాలి. రెండు వారాల్లో పరిస్థితి మెరుగుపడాలి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలి. ఆరు నెలల తర్వాత మెరుగు పడకపోతే చర్యలు తీసుకోవాలని' సీఎం సూచించారు.   జిల్లాల్లో ఆరోగ్యశ్రీ కో ఆర్డినేషన్‌ బాధ్యతలు జేసీలకు అప్పగించాలని  సీఎం ఆదేశించారు. ఆరోగ్య ఆసరా కింద ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని కూడా పెంచారు.