మంగళవారం 01 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 02, 2020 , 16:34:07

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రజలందరూ చప్పట్లు కొట్టాలి... ఎందుకంటే...?

ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రజలందరూ చప్పట్లు కొట్టాలి... ఎందుకంటే...?

అమరావతి: చప్పట్లు కొట్టడమేంటని మీకు సందేహం రావొచ్చు. ఎవరు చెప్పారో తెలుసా..?  ఏపీ సి ఎం జగన్. అవును ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రజలందరూ చప్పట్లు కొట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ వ్యవస్థకు నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యాన్ని సాధ్యం చేస్తున్న వారికి అభినందనలు చెప్పాలని, అందులో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి ప్రోత్సహించాలని సీఎం జగన్ తెలిపారు. తన నివాసం నుంచి సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.