మంగళవారం 11 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 15, 2020 , 11:58:28

కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం..కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం!

కొనసాగుతున్న ఏపీ కేబినెట్‌ సమావేశం..కొత్త జిల్లాల ఏర్పాటుపై నిర్ణయం!

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌  కేబినెట్‌ సమావేశం  ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.  రాష్ట్రంలో కొత్త  జిల్లాల ఏర్పాటుపై అధ్యయనానికి కమిటీ వేసే అంశంపై  సమావేశంలో చర్చించనున్నారు. 

శాండ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. రెన్యూవబుల్‌ ఎనర్జీ ఎక్స్‌పోర్ట్‌ పాలసీపై కేబినెట్‌లో ప్రస్తావించనున్నారు. విద్యాశాఖలో నాడు-నేడు కార్యక్రమం అమలుపై చర్చించనున్నారు.  గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలను ఖరారు చేయనున్నట్లు తెలిసింది. పార్లమెంట్‌  నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 


logo