మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 07, 2020 , 08:12:06

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

ఏపీలో మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయం సృష్టిస్తున్నది. రోజు రోజుకు వేలల్లో పాజిటివ్‌ కేసుల నమోదవుతున్నాయి. ఇప్పటికే పలువురు మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు మహమ్మారి బారినపడ్డారు. తాజాగా మ‌రో ఎమ్మెల్యే కూడా క‌రోనాబారిన పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి క‌రోనా పాజిటివ్‌ తేలింది. లక్షణాలు ఉండగా, పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. అధికారులు కుటుంబీకులతో పాటు, సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి, పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. కాగా, ఏపీలో ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘుపతి సహా పలువురు ఎమ్మెల్యేలు వైరస్‌ బారినపడ్డారు. ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్యకు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు కరణం బలరాం మహమ్మారి బారినపడ్డారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo