సోమవారం 18 జనవరి 2021
Andhrapradesh-news - Nov 30, 2020 , 15:29:11

దుర్గమ్మ ఆలయంలో...మరో వివాదం.

దుర్గమ్మ ఆలయంలో...మరో వివాదం.

అమరావతి: దుర్గమ్మ ఆలయంలో మరో వివాదం కలకలంరేపుతున్నది. ఆలయ చైర్మన్ పైల సోమినాయుడు జన్మదిన వేడుకలు దైవసన్నిధిలో జరుపడం వివాదాస్పదమైంది. దేవాలయ ప్రాగణంలో కేక్ కట్ చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై  వివరణ కోరగా కేక్‌లో గుడ్డు లేదని సమాధానమిచ్చారు. ఆలయంలో కోడిగుడ్డుతో తయారు చేసిన కేక్‌ను సోమినాయుడు కట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని హిందూ పరిరక్షణ సమితి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.