అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో 5.76 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసులను కేంద్రం కేటాయించింది. ఇవాళ ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వ్యాక్సిన్లు చేరుకున్నాయి. వీటిని వైద్య అధికారులు గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. అనంతరం రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వీటిని సరఫరా చేయనున్నారు. ఏపీకి అదనపు వ్యాక్సిన్ డోసులు అందడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.