ఆదివారం 09 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 09, 2020 , 16:19:12

అల్లుడి కోసం 67 వంట‌లు వండిన‌ ఆంధ్రా అత్త‌.. వీడియో

అల్లుడి కోసం 67 వంట‌లు వండిన‌ ఆంధ్రా అత్త‌.. వీడియో

కొత్త అల్లుడిని అత్త‌లు అపురూపంగా చూసుకుంటారు. ఆ మ‌ర్యాద‌లు చూస్తుంటే.. వామ్మో అనిపిస్తుంది. అంత క్రేజీ ఉంటుంది మ‌రి కొత్త అల్లుడికి. తెలుగు రాష్ర్టాల్లో అయితే అల్లుడికిచ్చే మ‌ర్యాదే వేరే. అలాంటి అల్లుడి కోసం ఓ ఆంధ్రా అత్త ఒక‌ట్రెండు వెరైటీలు కాదు.. ఏకంగా 67 వంట‌కాల‌ను వండింది. అత్త అంటే అలా ఉండాలి మ‌రి. 

కొత్త అల్లుడి కోసం వండిన వంట‌ల‌ను చూస్తే అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. మొత్తం ఐదు ద‌ఫాలుగా 67 ర‌కాల‌ను సిద్ధం చేసిన అత్త‌.. ఆ వంట‌ల‌ను నెటిజ‌న్ల‌కు ప‌రిచ‌యం చేసింది. అనంత్ రూపంగుడి అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ఈ వీడియోను పోస్టు చేయ‌డంతో వైర‌ల్ గా మారింది. ఆమె వండిన వంట‌కాల గురించి వీడియోలో వివ‌రంగా తెలిపారు. ఆమె వంట‌కాల చెప్తుంటే మ‌న‌కు కూడా నోరూర‌క త‌ప్ప‌దు. logo