మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 06, 2020 , 16:14:23

ఏపీలో అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు

 ఏపీలో  అక్టోబరు 15న తెరుచుకోనున్న కాలేజీలు

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నత విద్యపై  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  రాష్ట్రంలో అక్టోబర్‌ 15 నుంచి కళాశాలలు ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.  ఉన్నత విద్యా విధానంపై ఉన్నతాధికారులతో సీఎం   జగన్‌  గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెనల ద్వారా పెద్ద చదువులకు అండగా నిలుస్తున్నామని సీఎం చెప్పారు.   గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ను 32.4 శాతం నుంచి 90శాతానికి తీసుకెళ్లాలని అన్నారు.   రేషియో పెరగాలని అన్నారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై  కఠిన చర్యలు  తీసుకోవాలని ఆదేశించారు.  ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి  సీఎం జగన్‌  గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.కాలేజీల్లో కూడా నాడు-నేడు కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు.  తెలుగు, సంస్కృతం అకాడమీల ప్రారంభానికి  సీఎం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చారు. 


logo