గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Jan 16, 2021 , 17:28:10

ఏపీలో 1987కు త‌గ్గిన‌ యాక్టివ్ కేసులు

ఏపీలో 1987కు త‌గ్గిన‌ యాక్టివ్ కేసులు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య మ‌రింత త‌గ్గింది. రోజువారీగా న‌మోద‌య్యే కొత్త కేసుల కంటే రిక‌వ‌రీలు ఎక్కువ‌గా ఉంటుండ‌టంతో యాక్టివ్ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో ఏపీలో కొత్త‌గా 114 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దాంతో ఆ రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 8,85,824కు చేరింది. కొత్త‌గా 326 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి కావ‌డంతో మొత్తం రిక‌వ‌రీల సంఖ్య 8,76,698కి పెరిగింది. 

కాగా, గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో ఒక్క క‌రోనా మ‌ర‌ణం కూడా న‌మోదు కాలేదు. అయితే ఇప్ప‌టికే ఆ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి బారినప‌డి మ‌ర‌ణించిన వారి సంఖ్య 7,139కి చేరింది. మొత్తం యాక్టివ్ కేసుల‌లో క‌రోనా రిక‌వ‌రీలు, మ‌ర‌ణాలుపోను ప్ర‌స్తుతం కేవ‌లం 1987 యాక్టివ్ కేసులు మాత్ర‌మే ఉన్నాయి.     

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo