శుక్రవారం 07 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 05, 2020 , 14:45:58

ఏపీలో కొత్తగా 998 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 998 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం కొత్తగా 998 కరోనా కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో  కరోనా వల్ల 14 మంది  చనిపోయారు.  ఒక రోజు వ్యవధిలోనే  ఏపీలో 961 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.  ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36 మందికి,  విదేశాల నుంచి వచ్చిన మరొకరికి  కోవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 18,697కి చేరింది.

రాష్ట్రంలో  కరోనా బారినపడి  మరణించిన వారి సంఖ్య 232కు పెరిగింది.  ప్రస్తుతం 10,043 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 8,422 మంది  కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo