గురువారం 29 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 18, 2020 , 16:05:52

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధింపు

ఏపీలో పెట్రోల్‌, డీజిల్‌పై సెస్‌ విధింపు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు,  డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు  రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   వ్యాట్‌కు అదనంగా ఈ రెండు ఉత్పత్తులపైనా సెస్‌ వసూలు చేయనున్నారు.  సెస్‌ విధింపు ద్వారా ఏడాదికి  రూ.600 కోట్ల మేర ఆదాయం వస్తుందని  ప్రభుత్వం భావిస్తున్నది. డీలర్‌ నుంచి వసూలు చేసే  సెస్‌ ద్వారా వచ్చే ఆదాయాన్ని రోడ్ల నిర్మాణం కోసం కేటాయించనున్నారు. ఈ నిధులను రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు రెవెన్యూశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ వెల్లడించారు. 


logo