శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Andhrapradesh-news - Jan 27, 2021 , 18:31:44

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న డెంటిస్ట్‌కు అస్వస్థత

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న డెంటిస్ట్‌కు అస్వస్థత

అమరావతి : ఏపీలో ఒంగోలులో కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ దంత వైద్యురాలు అస్వస్థతకు గురైంది. దీంతో ఆమె చెన్నైలోని హాస్పిటల్‌లో చేరింది. అయితే ఆమె అనారోగ్యానికి టీకానే కారణమనే వదంతులను ఆరోగ్యశాఖ సీనియర్‌ అధికారి ఖండించారు. డెంటిస్ట్‌ ధనలక్ష్మికి ఇటీవల ప్రకాశం జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో టీకాలు వేశారు. అనంతరం ఆమె తనకు జ్వరం వచ్చినట్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) రత్నావళి మాట్లాడుతూ.. ధనలక్ష్మి మూత్ర, కాలేయ సంబంధ వ్యాధితో ప్రైవేటు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఆమె బీపీ గణనీయంగా పడిపోయిందని, మంగళవారం అధిక జ్వరంతో బాధపడిందని, దీంతో ఆమెను చెన్నైలోని అపోలో హాస్పిటల్‌కు తరలించినట్లు తెలిపారు. ఆమె పరిస్థితి కొంత విషమంగా ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇమ్యునైజేషన్‌ డ్రైవర్‌లో మంగళవారం వరకు దేశవ్యాప్తంగా 20లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు దేశంలో అత్యధిక సంఖ్యలో టీకాలు కర్ణాటకలో 2,31,601, ఒడిశా 1,77,090, రాజస్థాన్ 1,61,332, మహారాష్ట్ర 1,36,901 వ్యాక్సిన్లు వేశారు.

VIDEOS

logo