ఆదివారం 09 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 14, 2020 , 22:59:11

ఏసీ బస్సులతో సహ అన్ని బస్‌లు నడపాలి

ఏసీ బస్సులతో సహ అన్ని బస్‌లు నడపాలి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్‌లన్నింటినీ నడుపాలని ఏపీఎస్‌ఆర్టీసీ సంస్థ నిర్ణయించింది. ఏసీతో పాటు అన్ని  బస్సులు నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఈడీ ఆర్‌ఎంలకు ఆదేశాలు జారీ  చేశారు. కండక్టర్లు, డ్రైవర్లు మాస్కులు, శానిటైజర్లు వాడాలని వివరించారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

ఆర్టీసీలో కండక్టర్‌ లేకుండా బస్సులు నడిపే విధానాన్ని  ఉపసంహరించుకుంది . పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులను కండక్టర్లతో తిప్పాలని, కండక్టర్లను వినియోగిస్తూనే డిజిటల్‌ లావాదేవీలు పెంచాలని , ఓపీఆర్‌ఎస్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా టికెట్ల జారీని ప్రోత్సహించాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు నగరాల్లో సిటీ బస్సులు నడపవద్దని ఆర్‌ఎంలకు ఆదేశాలు జారీ చేశారు. logo