ఆదివారం 09 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 11, 2020 , 17:07:43

ఏపీలో కొత్తగా 1,813 కరోనా కేసులు..17 మరణాలు

ఏపీలో కొత్తగా 1,813  కరోనా కేసులు..17 మరణాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది.  గడచిన 24 గంటల్లో కొత్తగా 1,813 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఒక్కరోజే కరోనా వల్ల 17 మంది చనిపోయారు. 

24 గంటల్లో  ఏపీకి చెందిన 1,775 మందికి కరోనా సోకగా, విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురితో పాటు     ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చిన 34 మందికి కొవిడ్‌-19  పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  ఏపీలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,235కు పెరిగింది. కరోనా బారినపడి  ఇప్పటి వరకూ రాష్ట్రంలో 309 మంది మరణించారు.  రాష్ట్రంలో ప్రస్తుతం 12,533 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. logo