శుక్రవారం 05 మార్చి 2021
Andhrapradesh-news - Jan 28, 2021 , 20:27:44

ఇంత త‌క్కువ‌లో అంత సుంద‌ర ర‌థం నిర్మించ‌డం అభినంద‌నీయం

ఇంత త‌క్కువ‌లో అంత సుంద‌ర ర‌థం నిర్మించ‌డం అభినంద‌నీయం

అమ‌రావ‌తి : తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ గురువారం ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా నూతనంగా నిర్మించిన రథాన్ని స్వామిజీ పరిశీలించారు. ఆలయ అభివృద్ధిపై అధికారులు, పండితులకు ప‌లు కీలక సూచనలు చేశారు. రథ సంప్రోక్షణ ఆగమానుసారం శాస్త్రబద్ధంగా నిర్వహించాలన్నారు. నూతన రథం అత్యంత సుందరంగా ఉందన్నారు. 90 రోజుల్లో 40 అడుగుల ఎత్తున ఇంత అద్భుతంగా రథాన్ని నిర్మించడం అభినందనీయమ‌న్నారు. ఉత్సవాలకు ముందే రథాన్ని నిర్మించడం ఆనందనీయమ‌న్నారు. ఆలయాల్లో రథాలు భగవంతుని శరీరంలో భాగం అన్నారు. దైవ సంపద పరిరక్షణ దేవాదాయశాఖతో పాటు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

VIDEOS

logo