మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Sep 16, 2020 , 14:47:00

గుంటూరులో 80 ల‌క్ష‌ల విలువ చేసే సెల్‌ఫోన్లు చోరీ

గుంటూరులో 80 ల‌క్ష‌ల విలువ చేసే సెల్‌ఫోన్లు చోరీ

గుంటూరు : మ‌ంగ‌ళ‌గిరి స‌మీపంలో జాతీయ ర‌హ‌దారిపై సెల్‌ఫోన్లు త‌ర‌లిస్తున్న కంటైన‌ర్‌లో చోరీ జ‌రిగింది. శ్రీసిటీ నుంచి కోల్‌క‌తాకు వెళ్తుండ‌గా ఈ చోరీ జ‌రిగిన‌ట్లు పోలీసులు నిర్ధారించారు. కంటైన‌ర్ వెనుక భాగం ప‌గుల‌గొట్టి ఫోన్ల‌ను చోరీ చేశారు దుండ‌గులు. సుమారు రూ. 80 ల‌క్ష‌ల విలువ చేసే 980 సెల్‌ఫోన్లను చోరీ చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఘ‌ట‌నాస్థ‌లికి గుంటూరు అర్బ‌న్ ఎస్పీ అమ్మిరెడ్డి చేరుకుని ప‌రిస్థితిని ప‌ర్య‌వేక్షించారు. గుంటూరులోకి లారీ ప్ర‌వేశించాక చోరీ జ‌రిగిన‌ట్లు లారీ డ్రైవ‌ర్ తెలిపాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.  


logo