బుధవారం 30 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 15, 2020 , 19:10:49

ఏపీలో కొత్త‌గా 8,732 క‌రోనా పాజిటివ్ కేసులు

ఏపీలో కొత్త‌గా 8,732 క‌రోనా పాజిటివ్ కేసులు

అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ర్టంలో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 8,732 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. 53,712 శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా వీటిలో 8,732 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యాయి. కోవిడ్‌-19 కార‌ణంగా ఒక్క‌రోజులో ఏపీలో 87 మంది చ‌నిపోయారు. 10,414 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ర్టంలో యాక్టివ్ కేసులు 88,138. 

జిల్లాల వారీగా కోవిడ్ మ‌ర‌ణాలు ఈ విధంగా ఉన్నాయి. చిత్తూరులో 10 మంది, గుంటూరు-9, తూర్పుగోదావ‌రి-8, ప‌శ్చిమ‌గోదావ‌రి-8, అనంత‌పురం-7, క‌డ‌ప‌-7, క‌ర్నూలు-7, నెల్లూరు-6, విశాఖ‌ప‌ట్నం-6, విజ‌య‌న‌గ‌రం-6, ప్ర‌కాశం-5, శ్రీ‌కాకుళం-5, కృష్ణ జిల్లాలో ముగ్గురు చొప్పున మ‌ర‌ణించారు.


తాజావార్తలు


logo