e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, September 17, 2021
Home Top Slides తెలంగాణ నుంచి టీటీడీ బోర్డులోకి ఏడుగురు

తెలంగాణ నుంచి టీటీడీ బోర్డులోకి ఏడుగురు

  • జూపల్లి, పార్థసారధి, మురంశెట్టికి మళ్లీ అవకాశం
  • కొత్త పాలకమండలిని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌, సెప్టెంబర్‌ 15: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఖరారు చేసింది. బోర్డులో ఏపీ నుంచి పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, మేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, గొల్ల బాబురావు, బుర్రా మధుసూదన్‌, కాటసాని రాంభూపాల్‌రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి మైహోమ్స్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సిద్ధిపేటకు చెందిన సామాజిక సేవకుడు మారంశెట్టి రాములు, హెటిరో డ్రగ్స్‌ అధినేత బండి పార్థసారథిరెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మన్నె జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, రాజేశ్‌ శర్మలకు చోటు దక్కింది. జూపల్లి, మారంశెట్టి, పార్థసారధిరెడ్డిలు గత పాలకమండలిలో కూడా సభ్యులుగా ఉన్నారు. తమిళనాడు నుంచి శ్రీనివాసన్‌, నందకుమార్‌, కన్నయ్య, కర్ణాటక నుంచి శశిధర్‌, విశ్వనాథ్‌రెడ్డిని బోర్డు సభ్యులుగా ఎంపిక చేసినట్టు సమాచారం. నూతన పాలకవర్గానికి సంబంధించిన జీవో వెలువడాల్సి ఉన్నది. ఈసారి టీటీడీ పాలకమండలిలో మొత్తం 80 మంది ఉండనున్నారని తెలిసింది. చైర్మన్‌తోపాటు 25 మంది సభ్యులు, నలుగురు ఎక్స్‌ అఫీషియో సభ్యులు, 50 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమించనున్నట్టు సమాచారం.

ప్రత్యేక ఆహ్వానితులు
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సుధాకర్‌, తాడిశెట్టి మురళి, కష్ణప్రసాద్‌, చిక్కపల్లి సురేశ్‌, ఓక్రిడ్జ్‌ ప్రసాద్‌, రామిరెడ్డి, రాధాకష్ణ, అమూల్‌ కాలే, దుష్మన్‌కుమార్‌దాస్‌, దయాసాగర్‌రెడ్డి, బీరేంద్రవర్మ, మంజునాథ్‌, డాక్టర్‌ రామకృష్ణ, లోకనాథ్‌, శరవణ, రామచంద్రమూర్తి, రంగమ్మ, దాసరి కిరణ్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, శంభుప్రసాద్‌ మహంతు, రూపానంద రెడ్డి, కుమారగురు, నాగార్జునరెడ్డి, ఈ శ్రీనివాసనాయుడు, మసీమ్‌బాబు, కొట్టు మురళి, సుబ్బారెడ్డి, కావేరి సీడ్స్‌ అధినేత జీవీ భాస్కర్‌రావు, రవి నారాయణ, మహేశ్వరరాజు, రమేశ్‌ శెట్టి ,పొంగులేటి ప్రసాద్‌రెడ్డి, రవిప్రసాద్‌, లల్లూ అగర్వాల్‌, సిద్ధార్థ లాడే, గోవిందరాజులు, ఆంజనేయులు తదితరులు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana