బుధవారం 23 సెప్టెంబర్ 2020
Andhrapradesh-news - Aug 10, 2020 , 20:15:49

ఏపీలో ఒక్క‌రోజే 80 క‌రోనా మ‌ర‌ణాలు

ఏపీలో ఒక్క‌రోజే 80 క‌రోనా మ‌ర‌ణాలు

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ కొన‌సాగుతున్న‌ది. ప్ర‌తిరోజు ఐదు వేల‌కు త‌గ్గ‌కుండా కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం రాత్రి వ‌ర‌కు గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో ఏపీలో కొత్త‌గా 7,665 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,35,525కు చేరింది. అందులో 1,45,636 మంది వైర‌స్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 87,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వేగంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 80 మంది క‌రోనా బాధితులు మ‌ర‌ణించారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2,116కు చేరింది. తూర్పుగోదావ‌రి జిల్లాలో అత్య‌ధికంగా 32,938 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. క‌ర్నూలు (28,314), అనంత‌పురం (24,738) ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక క‌ర్నూలులో అత్య‌ధికంగా 251 క‌రోనా మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. గుంటూరు (233), తూర్పుగోదావ‌రి (228) ఆ త‌ర్వాత స్థానాల్లో ఉన్నాయి.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo