బుధవారం 28 అక్టోబర్ 2020
Andhrapradesh-news - Sep 30, 2020 , 21:51:20

ఏపీలో కొత్తగా 6133 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 6133 కరోనా కేసులు

అమ‌రావ‌తి : ఏపీలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. కొద్ది రోజులుగా నిత్యం ఐదువేలకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు 24 గంటల్లో కొత్తగా 6133 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 6,93,483కి చేరింది. అందులో 6,23,211 మంది ఇప్పటికే వైరస్‌ నుంచి కోలుకొని డిశార్జి అయ్యారు.  ప్రస్తుతం ఏపీలో 58,445 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా వైరస్‌ ప్రభావంతో 48 మంది మృత్యువాతపడగా ఇప్పటి వరకు 5828 మంది మరణించారు. గడిచిన 24గంటల్లో 71,806 టెస్టులు చేయగా.. మొత్తం 58,06,558 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo