అలియాభట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వం వహిస్తూ డా॥ జయంతిలాల్ గడతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, ఇమ్రాన్ హష్మీ అతిథి పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్ర తెలుగు టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదలచేసింది. ‘కామాఠిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదు అని అంటారు ఎందుకంటే ఇక్కడ గంగు ఉంటుంది’ అనే వాయిస్ ఓవర్‌తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆసక్తిని పంచుతోంది. గంగూబాయి అనే వేశ్య గృహం యజమానిగా అలియాభట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. వేశ్యగా ప్రయాణాన్ని మొదలుపెట్టి అందరిని శాసించే ఓ నాయకురాలిగా ఆమె ఎలా ఎదిగిందనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హుస్సేన్ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబయి’ నవల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూలై 30న ఈ సినిమా విడుదలకానుంది.