సోమవారం 13 జూలై 2020
Andhrapradesh-news - Jun 06, 2020 , 07:37:49

ఒడిశా నుంచి నాటుసారా అక్రమ రవాణా

ఒడిశా నుంచి నాటుసారా అక్రమ రవాణా

శ్రీకాకుళం : ఏపీలోని శ్రీకాకుళం జిల్లా భోగాపురంలో 350 లీటర్ల నాటుసారాను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఒడిశా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా నాటాసారాను తరలిస్తుండగా పోలీసులు రైడ్‌ చేసి పట్టుకున్నారు. కాశిబుగ్గ డీఎస్‌పీ శివరామిరెడ్డి వివరాలను తెలియజేస్తూ... సమాచారం మేరకు ఎస్‌ఐ ప్రసాద్‌ తన సిబ్బందితో  వెళ్లి మహేంద్రతనయ నది సమీపంలోని భోగాపురం గ్రామంలో రైడ్‌ చేశాడు. 

28 గన్నీ బ్యాగులో తరలిస్తున్న సారాను స్వాధీనం చేసుకుని 14 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నాం. ఒడిశా నుంచి ఇద్దరు వ్యక్తులు పంపగా సోంపేటకు చెందినవారు వీటిని రీసివ్‌ చేసుకుంటున్నారు. వీరికి రవాణా ఏర్పాట్లు చేసిన వ్యక్తిని సోంపేటకు చెందిన నల్లా దివాకర్‌గా గుర్తించామన్నారు. మొత్తం 16 మందిని కస్టడీలోకి తీసుకోగా మరో నలుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారన్నారు. నాటుసారా అమ్మకందారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే రౌడీ షీట్‌ ఓపెన్‌ చేసేందుకు వెనుకాడబోమన్నారు.


logo