శుక్రవారం 04 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Oct 20, 2020 , 19:30:49

ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 3,503 కరోనా కేసులు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో వైరస్‌ మహమ్మారి కరోనా కాస్త శాంతించింది. గడిచిన నాలుగురోజులుగా కేసుల సంఖ్య తగ్గింది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 3,503 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 5,144 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 28 మంది  మృత్యువాతపడినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

రాష్ట్రంలో ఇప్పటివరకు 7,89,553 మంది కరోనా బారినపడగా 7,49,678 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 33,396 మంది చికిత్స పొందుతుండగా 6,481 మంది మృతి చెందారు.  గడిచిన 24 గంటల వ్యవధిలో 69,095 మందికి కరోనా పరీక్షలు చేయగా ఇప్పటివరకు 71,96,628 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు వెల్లడించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.