శనివారం 11 జూలై 2020
Andhrapradesh-news - Jun 06, 2020 , 13:17:38

ఏపీలో కొత్తగా 210 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 210 కరోనా కేసులు

అమరావతి  ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. గడచిన 24 గంటల్లో 12,771 మంది నమూనాలు పరీక్షించగా మరో  210 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో   రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,460కు చేరింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 41 మందితో పాటు 8 మంది విదేశీయులకు కరోనా సోకింది. రాష్ట్రంలో 161 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

తాజాగా మరో 29 మంది కోలుకున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇప్పటి వరకు 73 మంది మృతి చెందారు. ప్రస్తుతం 1,192 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకూ 2,323 మంది కోలుకున్నారు.  


logo