గురువారం 04 మార్చి 2021
Andhrapradesh-news - Jan 13, 2021 , 17:58:31

ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 203 కరోనా కేసులు

అమరావతి : ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 203 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడిన వారిలో 231 మంది కోలుకున్నారు. ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో ఇప్పటివరకు 8,85,437 కొవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 8,75,921 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,382 మంది దవాఖానల్లో చికిత్స పొందుతున్నారు. 7,134 మంది ప్రాణాలు కోల్పోయారని వైద్య ఆరోగ్యశాఖ  నివేదికలో వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 44,679 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 1,24,41,272 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo