బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 13, 2020 , 16:27:03

ఆంధ్రాలో కరోనా టెస్ట్ ల పై వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు

ఆంధ్రాలో కరోనా టెస్ట్ ల పై వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరీక్షల పై వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి పరీక్షలు చేసేందుకు తొలుత ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు వాడాలని సూచించింది. యాంటీజెన్ పరీక్షలో పాజిటివ్ వస్తే వెంటనే చికిత్స ప్రారంభించాలని, ఒకవేళ వైరస్ లక్షణాలు ఉండి నెగెటివ్ వస్తే వెంటనే ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని తెలిపింది. అందులోనూ నెగెటివ్ వస్తే రియల్ టైమ్ ఆర్టీ పీసీఆర్ టెస్టు చేయాలని కోరింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, డీఎంహెచ్ఓలకు వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అంతేకాదు, ఒక్కో జిల్లాకు 20 వేల ర్యాపిడ్ యాంటీజెన్ కిట్లు పంపినట్టు   వెల్లడించింది. హైరిస్క్ జోన్లు, కంటైన్మెంట్ జోన్లలో కరోనా టెస్టులు ఎక్కువ సంఖ్యలో చేపట్టాలని పేర్కొన్నది.


logo