గురువారం 13 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 11, 2020 , 19:32:04

గన్నవరం విమానాశ్రయం లో కరోనా కలకలం

గన్నవరం విమానాశ్రయం లో కరోనా కలకలం

విజయవాడ : విశాఖపట్నం ఏపిఎస్పి 16 బెటాలియన్ సిబ్బంది సుమారు 50 మంది గన్నవరం విమానాశ్రయం గత కొద్దిరోజులగా డ్యూటీ చేస్తున్నారు.  వీరిలో కొంతమంది కి పాజిటివ్ గా తేలింది. దింతో వీరిని ఐసోలేషన్ కు తరలించారు. మిగత సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించి విశాఖకు తరలించారు. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలను కరోనా మహమ్మారి వణికిస్తున్నది. డిప్యూటీ సిఎం నారాయణస్వామి చిన్నల్లుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. కెనడా నుంచి వచ్చిన నారాయణస్వామి చిన్నల్లుడు హోం ఐసోలేషన్ లోకి నారాయణస్వామి వెళ్లారు. అలాగే, నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. గన్ మెన్‌కు పాజిటివ్ రావడంతో హోం ఐసోలేషన్ లోకి వెళ్లిన రోజా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


logo