Andhrapradesh-news
- Jul 10, 2020 , 22:59:53
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శిగా భాను ప్రకాష్
_1594402186.jpeg)
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ కార్యదర్శిగా వై భాను ప్రకాష్‌ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. మరోవైపు కరోనా ఆస్పత్రులను పర్యవేక్షించేందుకు స్పెషల్ ఆఫీసర్‌గా రాజమౌళిని ప్రభుత్వం నియమించింది. కరోనా ఆస్పత్రుల సామర్థ్యం, సన్నద్ధత పర్యవేక్షణ తదితర బాధ్యతలను రాజమౌళి పర్యవేక్షించనున్నారు. దేశంలో కరోనా టెస్ట్‌లను అత్యధికంగా నిర్వహిస్తున్న రాష్ట్రంగా ఆంధ్రపదేశ్ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. శుక్రవారం రాష్ట్రంలో కొత్తగా 1608 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 21,020 శాంపిల్స్‌ను పరిక్షించగా అందులో 1576 కేసులు ఏపీలో నమోదవ్వగా, మిగతా 32 కరోనా కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు సంఖ్య 25,422కి చేరింది.
తాజావార్తలు
- అక్కా వెళ్లిపోతున్నా.. పిల్లలు జాగ్రత్త
- ఈ రాశుల వారికి.. వ్యయ, ప్రయాసలు అధికం!
- 28 ప్రాంతాల్లో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు
- టీకా ఇచ్చి అభయం కల్పించి..
- నాలా ప్రహరీ నిర్మాణానికి రూ. 68 కోట్లు
- టీకా వచ్చిందిగా ఢోకా లేదిక
- దేశం గర్విస్తుంది : గవర్నర్
- సర్కారు స్థలాలు కబ్జా చేస్తే సహించేది లేదు
- సేవలోనే ఆనందం
- నిర్భయంగా.. వ్యాక్సిన్ వేసుకోండి!!
MOST READ
TRENDING