గురువారం 13 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 06, 2020 , 23:00:33

పుష్పయాగానికి అంకురార్ప‌ణ‌

 పుష్పయాగానికి అంకురార్ప‌ణ‌

తిరుపతి : అప్ప‌లాయ‌గుంట‌లోని శ్రీ ప్ర‌స‌న్న వేంకటేశ్వరస్వామివారఆలయంలో రేపటి నుంచి వార్షిక పుష్పయాగం నిర్వహించనున్నారు. అందుకోసం సోమవారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు మేధినిపూజ‌, సేనాధిప‌తి ఉత్స‌వం,  శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ నిర్వ‌హించారు. మంగ‌ళ‌వారం ఉదయం 8.00 నుంచి 10.00 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 10.00 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత ప్ర‌స‌న్న‌వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పుష్పయాగం ఏకాంతంగా జరుగనుంది. 

తులసి, చామంతి, మొగలి, మల్లె, జాజి సంపంగి, రోజా, కలువలు వంటి పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేయనున్నారు. జూన్ 2 నుంచి 10వ తేదీ వరకు శ్రీ ప్ర‌స‌న్న‌ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగిన విషయం తెలిసిందే. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల‌లో భాగంగా ఆల‌యంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వ‌హిస్తారు.


logo