బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 04, 2020 , 00:28:02

ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు: జవహర్‌ రెడ్డి

ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి  కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు: జవహర్‌ రెడ్డి

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 9.7 లక్షల మందికి  కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షల నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డి తెలిపారు. మిలియన్‌కు 18200 మందికి పరీక్షలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిర్మాణ రంగం, వ్యవసాయ కూలీలు, కూరగాయలు, పండ్ల మార్కెట్లలో కూలీలకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు 20వేల మంది వలస కూలీలకు పరీక్షలు చేశామని.. రెండు వేల మందికిపైగా కోవిడ్‌ కేర్‌ సెంటర్స్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఏడు వేల మంది ఆస్పత్రుల్లో, హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. అన్‌లాక్‌ ప్రారంభమయ్యాక దేశంలో, రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగు తున్నదని.. ఈ నేపథ్యంలో వైరస్‌ ఏ రకంగా వ్యాప్తి చెందుతుందనే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.


తాజావార్తలు


logo