బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 02, 2020 , 21:50:22

చిత్తూరు భూముల విషయంలో క్లారిటీ ఇచ్చిన అమర రాజా గ్రూప్

చిత్తూరు భూముల విషయంలో క్లారిటీ ఇచ్చిన అమర రాజా గ్రూప్

చిత్తూరు: అమర రాజా ఇన్ఫ్రా, (అమర రాజ గ్రోత్ కారిడార్)చిత్తూరు భూములకు సంబంధించిన గవర్నమెంట్ ఆర్డర్ గురించి వచ్చే ఆరోపణల్లో వాస్తవం లేదని అమర రాజా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం వివరణ ఇచ్చింది. చిత్తూరు భూముల వ్యవహారంలో ప్రసార మాధ్యమాల ద్వారానే  తెలుసుకోవడం జరిగిందని, ఈ విషయానికి సంబంధించి తమకు ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి సమాచారం రాలేదని ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది అమర రాజా సంస్థ. తమ సంస్థ ను ప్రారంభించినప్పటి నుంచి ఉపాధి అవకాశాలను కల్పించడంతో పాటు , ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం మే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. 


logo