బుధవారం 12 ఆగస్టు 2020
Andhrapradesh-news - Jul 02, 2020 , 20:10:21

ఏపీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రమేష్ కుమార్

 ఏపీ చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రమేష్ కుమార్

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌గా రిటైర్డ్‌ ఐఏఎస్‌ రమేష్ ‌కుమార్‌ను నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిజారీ చేశారు.1986 బ్యాచ్‌, పశ్చిమ బెంగాల్‌ కేడర్ కు చెందిన ఐఏఎస్ అధికారిగా పని చేసి న రమేష్ కుమార్  2017లో రిటైర్ అయ్యారు. రమేష్‌ కుమార్‌ స్వస్థలం కడప జిల్లా... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సమాచార ప్రధాన కమిషనర్‌గా నియమితలవుతున్న తొలి వ్యక్తి కావడం విశేషం .  ఆయన నియామకానికి రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు .  


logo