మంగళవారం 14 జూలై 2020
Andhrapradesh-news - Jun 30, 2020 , 09:42:59

రేపటి నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

రేపటి నుంచి శ్రీ కపిలేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి పవిత్రోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను నాలుగురోజులపాటు అంటే జులై 4వతేదీ వరకు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8:30 గంటల వరకు అంకురార్పణ జరుగుతుంది. 2వ తేదీ గురువారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కలశ పూజ , హోమం, పవిత్ర ప్రతిష్ట చేస్తారు. 3వ తేదీ శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు హోమం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు యాగశాల పూజ, హోమం జరుగుతాయి. 4వ తేదీ శనివారం ఉదయం 6 -30 గంటల నుంచి మధ్యాహ్నం 12 – 30 గంటల వరకు మహాపూర్ణాహుతి,యాగశాల పూజ, హోమం, పూర్ణాహుతి, కలశం ఉద్వాసన, అభిషేకం, పవిత్ర సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 6 -30 గంటల నుంచి శ్రీవిఘ్నేశ్వరస్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వార్లను ఆలయం లోనే ఊరేగిస్తారు. కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా పవిత్రోత్సవాల కార్యక్రమాలు, ఊరేగింపు అన్నీ ఆలయంలోనే నిర్వహిస్తారు.


logo