మంగళవారం 19 జనవరి 2021
Andhrapradesh-news - Jun 23, 2020 , 00:05:59

సంచయిత పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

 సంచయిత పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

అమరావతి:  ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి దేవస్థానం చైర్‌పర్సన్‌ సంచయిత గజపతి అనర్హురాలని స్థానిక భక్తుడు ఫణింద్ర గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ముందుగా సింహాచలం తొలిపావంచా దగ్గర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఫిర్యాదు పత్రాన్ని స్వామివారు ముందు సమర్పించారు.. తరువాత గోపాలపట్నం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి సీఐ మళ్ల అప్పరావుకు ఫిర్యాదు చేశారు.. నిజమైన వారసురాలిగా సంచయిత నిరూపించుకున్న తరువాత దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టాలని పిటిషనర్‌ డిమాండ్‌ చేశారు. రాత్రికి రాత్రి దొడ్డి దారిన పదవి చేపట్టడం సరైంది కాదన్నారు. కేసు కోర్టులో ఉంటే ఎలా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రశ్నించారు.