గురువారం 02 జూలై 2020
Andhrapradesh-news - Jun 06, 2020 , 15:51:43

ఆంధ్రాలో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు

ఆంధ్రాలో విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు

అమరావతి : కరోనా వైరస్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ స్వీయ నియంత్రణ పాటించాల్సిందే. ప్రస్తుతం విద్యార్ధులు ఆన్‌లైన్‌లోనే చదువుకోవాల్సిన పరిస్థితులేర్పడుతున్నాయి. ఈ క్రమంలో నిరుపేద విద్యార్ధులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ అధ్యక్షతన జరిగిన సాంఘిక సంక్షేమ గురుకులాల సొసైటీ పాలకమండలి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకూ చదివే విద్యార్ధులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించారు.

రూ. 5 వేల నుంచి రూ. 6 వేల విలువ చేసే స్మార్ట్‌ఫోన్లను అందించనున్నారు. సొసైటీ పరిధిలో 60 వేల మంది విద్యార్ధులు చదువుతుండగా.. వారిలో 30 నుంచి 40 శాతం మందికి మాత్రమే స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. దీనితో మిగిలిన విద్యార్ధులకు ఆన్‌లైన్‌ విద్యలో ఎటువంటి ఆటంకం ఉండకూడదనే ఉద్దేశ్యంతోనే సొసైటీ ఈ నిర్ణయం తీసుకున్నది.


 


logo