శనివారం 11 జూలై 2020
Andhrapradesh-news - Jun 06, 2020 , 15:09:00

దుర్గమ్మతల్లి దర్శనం ఆలస్యం?

దుర్గమ్మతల్లి దర్శనం ఆలస్యం?

విజయవాడ : కేంద్రం ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ భక్తులకు దర్శనం ఏర్పాట్లు చేసేందుకు ఆలయాల అధికారులు సిద్దమవుతున్నారు. కేంద్ర సర్కారు సడలింపులు ఇవ్వడంతో జూన్ 8 నుంచి దేశవ్యాప్తంగా ఆలయాలన్నీతెరుచుకోనున్నాయి. అయితే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ దర్శనం  కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందట. విజయవాడలో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదుకావడమే ఇందుకు కారణం. కొండ దిగువున కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత పెరుగుతుండడంతో అమ్మవారి ఆలయానికి భక్తులను అనుమతించాలా? లేదా? అనే దానిపై  అధికారులు చర్చిస్తున్నారు. ఇంద్రకీలాద్రి కొండ సమీపంలోని విద్యాధరపురం, కుమ్మరిపాలెంసెంటర్, భవానీపురం, మల్లికార్జునపేట వంటి ప్రాంతాల్లో పారాజిటివ్ కేసుల సంఖ్య ఏమాత్రం తాగడం లేదు. ఈ నేపథ్యంలో దుర్గమ్మతల్లి దర్శనం కాస్త ఆలస్యం అయ్యేలా ఉన్నది. 


logo