ఆదివారం 12 జూలై 2020
Andhrapradesh-news - May 28, 2020 , 21:10:13

కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం

 కన్నా లక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం

అమరావతి:  ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఆయన చిన్న కుమారుడు ఫణీంద్ర భార్య సుహారిక అనుమానాస్పద రీతిలో చనిపోయారు. కన్నాలక్ష్మీనారాయణ కోడలు సుహారిక తన భర్త ఫణీంద్రతో కలిసి గచ్చిబౌలి ఫీల్ రిడ్జ్స్ విల్లాస్‌లో నివాసం ఉంటున్నారు. గురువారం మధ్యాహ్నం రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ విల్లాస్‌లో నివాసం ఉండే తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళారు. వెళ్ళి న కొద్దిసేపటికే సుహారిక కుప్పకూలి పడిపోయిందని స్నేహితురాలి కుటుంబీకులు చెబుతున్నారు. పడిపోయిన వెంటనే సుహారికను రాయదుర్గంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, హాస్పిటల్‌కు చేరుకునే లోపుగానే సుహారిక చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. 


logo