ఆదివారం 12 జూలై 2020
Andhrapradesh-news - May 28, 2020 , 20:52:55

సీఎం జగన్ కు లేఖ రాసిన సినీ నిర్మాతల మండలి

సీఎం జగన్ కు లేఖ రాసిన సినీ నిర్మాతల మండలి

విజయవాడ : చిత్ర పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని నిర్మాతల మండలి ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కోరింది. స్టూడియోలు, ల్యాబ్స్ తో పాటు నిర్మాతలు, నటీనటులు, ఇతర పరిశ్రమ వర్గాల ఇండ్ల కోసం స్థలాలను కేటాయించాలని విన్నవించింది. ఈ మేరకు జగన్ కు నిర్మాతల మండలి ఒక లేఖ రాసింది. జీవో నంబర్ 45 ద్వారా రాష్ట్రంలో షూటింగులు చేసుకోవడానికి ప్రభుత్వ ప్రాంగణాలను ఉచితంగా అందించేందుకు ఆదేశాలిచ్చిన సీఎంకు ధన్యవాదాలు తెలిపింది. అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలకు, ల్యాబ్స్ నిర్మించుకోవడానికి స్థలాలను ఉదారంగా కేటాయించారని నిర్మాతల మండలి జగన్ కు తెలిపింది. ఆర్టిస్టులు, నిర్మాతలు, ఇతర వర్గాల కోసం ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారని చెప్పింది. అదే విధంగా ఏపీలో సినీ పరిశ్రమను అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి స్థలాలను కేటాయించాలని విన్నవించింది.  


logo