మంగళవారం 07 జూలై 2020
Andhrapradesh-news - May 28, 2020 , 20:44:21

హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్

  హైకోర్టుకు హాజరైన ఏపీ సీఎస్

అమరావతి:  ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసిన అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని హైకోర్టుకు హాజరయ్యారు. తమపై కోర్టు పేర్కొన్నకోర్టు ధిక్కరణ అంశానికి  సంబంధించి ఆమె వివరణ ఇచ్చారు. నీలం సాహ్నితో పాటు.. పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌ కూడా కోర్టుకు హాజరయ్యారు. కోర్ట్ ఆదేశాలు బేఖాతరు చేశారని భావించిన న్యాయస్థానం... కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. దీంతో ముగ్గురు ఉన్నతాధికారులు హైకోర్టు ముందు హాజరయ్యారు.  


logo