సోమవారం 25 జనవరి 2021
Andhrapradesh-news - May 26, 2020 , 20:28:20

ముళ్ల పొదల్లో ఐదు లక్షల అక్రమ మద్యం

 ముళ్ల పొదల్లో ఐదు లక్షల అక్రమ మద్యం

గుంటూరు: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు- చినగార్లపాడు గ్రామాల  మధ్య ముళ్లపొదల్లో తెలంగాణ నుంచి మద్యం అక్రమంగా తీసుకువచ్చి నిల్వావుంచారు . 1600  మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు లక్షల రూపాయల విలువ ఉంటుందని వారు తెలిపారు. మద్యం అక్రమంగా తరలించిన ఇద్దరు వ్యక్తుల ను  పోలీసులు అదుపులోకి తీసుకోగా, మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు.  


logo