గురువారం 09 జూలై 2020
Andhrapradesh-news - May 26, 2020 , 00:03:02

టి.టి.డి. ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన, బి.జె.పిల నిరసన

 టి.టి.డి. ఆస్తుల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ జనసేన, బి.జె.పిల నిరసన

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం భూముల విక్రయానికి వ్యతిరేకంగా మంగళవారం భారతీయ జనతా పార్టీ చేపట్టే నిరసన కార్యక్రమాల్లో జనసేన  శ్రేణులు పాల్గొని, పార్టీ తరఫున మద్దతు తెలుపుతుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. బి.జె.పి. – జనసేన కలసి చేసే ఈ నిరసన కార్యక్రమాలపై పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆదేశాలిచ్చారనీ, అందుకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు.  స్థానిక బీజేపీ నాయకులను సమన్వయం చేసుకొంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. టి.టి.డి. భూములను వేలం ద్వారా విక్రయించే హక్కు ప్రభుత్వానికి లేదని,  టి.టి.డి. బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ మంగళవారం రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. ఈ అంశంపై నాదెండ్ల మనోహర్ జనసేన పార్టీ పార్లమెంటరీ సంయుక్త కమిటీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.


logo