శనివారం 06 జూన్ 2020
Andhrapradesh-news - May 24, 2020 , 00:20:43

శ్రీవారి లడ్డూ విక్రయాలకు ఏర్పాట్లు

శ్రీవారి లడ్డూ విక్రయాలకు ఏర్పాట్లు

తిరుపతి : 13 జిల్లా కేంద్రాల్లో  శ్రీవారి లడ్డూ ప్రసాదం అమ్మకానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందుకోసం శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని లారీల్లో ఏపీలోని జిల్లా కేంద్రాలకు చేరుస్తున్నది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). ఇప్పటికే విశాఖ, విజయ నగరం, శ్రీకాకుళం జిల్లాలకు స్వామివారి ప్రసాదాన్ని  చేర్చారు. కాగా 25వ తేదీ నుంచి సగం ధరకే లడ్డూలను భక్తులకు విక్రయించనున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించే వరకు 50 లడ్డూను 25కే విక్రయించనున్నారు టీటీడీ అధికారులు. 


logo